భవిష్యత్తులో e-Health హవా.. ప్రముఖ సంస్థ నివేదిక

by Harish |   (  Updated:2021-12-11 03:52:03  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఇ-ఫార్మా రంగం వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA వెల్లడించింది. ఆన్‌లైన్ సర్వీస్ ఆఫర్ల వలన వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఇ-హెల్త్-కేంద్రీకృత కంపెనీలు అధికంగా వృద్ధి చెందుతాయి. కరోనా కారణంగా ఆన్‌లైన్ సర్వీసులు పెరగడం వలన ఇ-ఫార్మసీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ సర్వీసులు, ఆఫ్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనున్నాయని CLSA నివేదిక తెలిపింది. e-Health మార్కెట్ స్థూల విలువ (GMV) [&hellip;]</p>

E-Health
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఇ-ఫార్మా రంగం వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA వెల్లడించింది. ఆన్‌లైన్ సర్వీస్ ఆఫర్ల వలన వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఇ-హెల్త్-కేంద్రీకృత కంపెనీలు అధికంగా వృద్ధి చెందుతాయి. కరోనా కారణంగా ఆన్‌లైన్ సర్వీసులు పెరగడం వలన ఇ-ఫార్మసీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ సర్వీసులు, ఆఫ్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనున్నాయని CLSA నివేదిక తెలిపింది.

e-Health మార్కెట్ స్థూల విలువ (GMV) $1.4 బిలియన్‌గా ఉంది. ఇది 2018-20 లో 67% CAGR వృద్ధిని సూచిస్తుంది. ఈ-ఫార్మసీ 2022 నాటికి $ 3.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (AIOCD) ప్రాతినిధ్యం వహిస్తున్న 8.5 లక్షల ఫిజికల్ రిటైల్ ఫార్మసీల నుండి కంపెనీలు గణనీయమైన సవాలును ఎదుర్కొంటున్నాయి. ఆఫ్‌లైన్ సంస్థలు కొన్ని గంటలలోపు ఆర్డర్‌లను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ సౌలభ్యాన్ని అందించగలరు. ఇన్‌ఫెక్షన్‌లు, గ్యాస్ట్రో, గైనకాలజీ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఆఫ్‌లైన్ అవసరం . ఇటువంటి చికిత్సల కోసం వినియోగదారులు ఇ-ఫార్మా కంపెనీలపై ఆధారపడటం లేదు.

కస్టమర్ల కోసం, ఆన్‌లైన్ సంస్థలు అందించే ముఖ్యమైన తగ్గింపులు ప్రధానంగా ఆకట్టుకుంటాయి. రిలయన్స్ రిటైల్, టాటా డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు 25-30 శాతం తగ్గింపును అందిస్తున్నారు. చిన్న చిన్న అవసరాలకు నేరుగా స్టోర్‌లకు వెల్లకుండా ఆన్‌లైన్ మార్కెట్‌‌ను సంప్రదిస్తున్నారు. రోగులు వైద్యులను ముఖాముఖిగా కలవడానికి ఇష్టపడతారు. దీని కారణంగా భారతదేశంలోనే కాకుండా ఇతర ప్రధాన మార్కెట్‌లలో డిజిటల్ ఆరోగ్య వ్యాప్తి తక్కువగా సూచిస్తోంది అని CLSA నివేదిక తెలిపింది.

Next Story