ఇమ్యూనిటీ గణపతి.. ఎక్కడో తెలుసా..?

138

దిశ, గుమ్మడిదల: మండల కేంద్రమైన గుమ్మడిదలకు చెందిన భాస్కరా చారి వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాన్ని తయారు చేశారు. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇమ్యూనిటీ గల తినుబండారాలు, వ్యాక్సిన్ వస్తువులు, శానిటైజర్ అమర్చి భౌతిక దూరం పాటించే గణపతిని తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. ఆ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నలుగురిని ఆకర్షిస్తున్నాడు. అతని ఆలోచనకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఇదివరకే భాస్కరాచారి మిఠాయిలతో గణనాధుని తయారు చేసి పూజలు నిర్వహించడాన్ని మండల వాసులు గుర్తు చేసుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..