కేటీఆర్ సారూ.. మా నాన్నను ఇంటికి రప్పించరూ…!!

98

దిశ, వేములవాడ: ఉన్న ఊరిలో కూలీ పనులు లేక మమ్మల్ని పోషించేందుకు కానరాని దేశాలకు వెళ్ళిన మా నాన్నను, అక్కడి కంపెనీ వాళ్ళు జీతాలు ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నాలుగు రోజులుగా తిండి,తిప్పలు లేక అవస్థలు పడుతున్న మా నాన్న ను ఎలాగైనా ఇంటికి రప్పించాలని ఓ కూతురు వేడుకుంటున్న వైనం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు రాములు నాలుగేళ్ల క్రితం సౌదీ అరేబియా లోని డెవలప్మెంట్ గ్రూప్ కంపెనీ లో లేబర్ పనిపై వలస వెళ్ళాడు గత ఆరు నెలలుగా కంపెనీ జీతాలు చెల్లించకుండా రాములను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంటికి పంపించమన్నప్పటికీ పాస్ పోర్ట్ దగ్గర పెట్టుకొని ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం నాలుగు రోజులుగా తినకుండా పస్తులు ఉంటున్నాడు. తన తండ్రి కంటతడి పెట్టుకుంటూ..పంపిన వీడియో మమల్ని ఆందోళనకు గురి చేస్తోందని రాములు కూతురు శైలజ వాపోయింది. ఎలాగైనా తన తండ్రిని జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించి ఇంటికి రప్పించెలా చేయాలని వేడుకుంటుంది. మరి శైలజ విన్నపంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..