ఉదయం టిఫిన్ చేయకపోతే ఎన్ని నష్టాలో తెలుసా ?

by  |
health tips 1
X

దిశ,వెబ్‌డెస్క్ : మనం తీసుకునే ఆహారంలో ముఖ్యమైనది అల్పాహారం. కానీ చాలా మంది అల్పాహారం తీసుకోరు. కొందరేమో ఆలస్యంగా నిద్రపోయి.. ఆలస్యంగా నిద్రలేవడం అలవాటుగా మారింది. కొందరికి షిఫ్టు డ్యూటీల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పట్టపగలు కూడా నిద్రపోవల్సి వస్తోంది. ఫలితంగా వీరు అల్పాహారాన్ని తీసుకోలేరు. దీంతో నిద్రలేచిన వెంటనే నేరుగా భోజనం చేసి మళ్లీ పడుకుంటారు. కొంత మంది త్వరగా ఆఫీసుకు రావలని, ఆఫీసు పనులలో నిమగ్నమై అల్పాహారం తీసుకోవడం మానేస్తారు. మరికొందరు నిర్లక్ష్యం తర్వాత తిందాములే అని వదిలేసి ఇక వాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేయడమే మానేస్తారు. మరికొందరికి బ్రేక్ ఫాస్ట్ చేయడం నచ్చదు. ఇంకొంత మంది బరువు పెరుగుతున్నాము అనే భయంతోనో లేక సన్నగా అవ్వాలనో బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. అయితే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు నిపుణులు.

అల్పాహారం తీసుకోక పోవడం వలన కలిగే నష్టాలు..

1 టీనేజ్ పిల్లలు తప్పని సరిగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి. లేని క్రమంలో వారిలో ఎదుగుదల అనేది ఆగిపోయి అనారోగ్యం పాలవుతారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా ఉపయోగపడుతుంది.
2. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వలన తరుచూ అనారోగ్యానికి గురిఅవుతాము.
3. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ మానేయడమే కాకుండా ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేసినా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు నిపుణులు. లేటుగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వలన మైగ్రేన్ బారిన పడే ప్రమాదం ఉంది.
4. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే రక్త హీనత బారిన పడే అవకాశం ఉంది.
5. ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువ.
6. బ్రేక్‌ఫాస్ట్ మానేసే మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.
7. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల రోజంతా ఎసిడిటీతో బాధపడాల్సి వస్తుంది.
8. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో జుట్టు రాలిపోవడం కూడా ఒకటి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌ని తీసుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది.


Next Story

Most Viewed