గాడిదలు కనిపించడం ఇక అరుదే.. ఎందుకో తెలుసా..?

by  |
Donkeys
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రామాలతోపాటు పట్టణాలు, నగరాల్లోనూ విక్రయిస్తుంటారు. గాడిదతో ఇంటి ముందుకే వచ్చి గ్లాస్ పాలకు రూ.100 నుంచి రూ.200 తీసుకుని అక్కడే పాలు పితికి ఇస్తుంటారు. గాడిది పాలతో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఉబ్బసం తగ్గుందని, శరీరం బలష్టంగా తయారవుతుందని ప్రచారం చేస్తుంటారు. పాల సంగతి ఉన్నా.. ప్రస్తుతం గాడిద మాంసం తింటే సర్వరోగ నివారిణిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్ పెరిగింది.

ఏపీలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఈ ప్రచారం వైరల్ అయింది. దీంతో కనిపించిన గాడిదలను వదిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీని మాంసం తింటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, లైంగిక శక్తి, వీర్య పుష్టి కలుగుతుందని, శరీర దారుఢ్యం పెరుగుతుందని ప్రచారం చేస్తు్న్నారు. ప్రజలు ఈ పుకార్లు నిజమా కాదా అని తెలుసుకోకుండనే గాడిద మాంసం కోసం క్యూ కట్టి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ వధకు ముందు ఏపీలో వేల సంఖ్యలో ఉన్న గాడిదల సంఖ్య.. ప్రస్తుతం ఐదు వేలకు పడిపోయిందని జంతు సంరక్షణ సంస్థ (ఎన్జీవో) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రాబోయే రోజుల్లో గాడిదలు అంతరించిపోయే జాతుల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. చట్ట ప్రకారం గాడిదలను చంపి తినడం నేరం. కానీ అక్రమార్కులు విష ప్రచారం చేస్తూ.. వాటి మాంసానికి డిమాండ్ పెంచేశారు. దీంతో మాంసం విక్రయాలు పెరగడంతో ఏపీలో గాడిదలు దొరకక కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గాడిదలను జూ పార్కుల్లోనే చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గాడిద మాంసం విక్రయాలను అరికట్టాలని, గాడిద పాలు, మాంసం వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.


Next Story