‘మత్తు’లో చిత్తవుతున్న యువత..!

by Shyam |

<p>దిశ ప్రతినిధి, వరంగల్: గంజాయి మత్తు యువత జీవితాలను నాశనం చేస్తోంది. మత్తుకు అలవాటు పడిన యువకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. సమయానికి మత్తు దొరకకపోయేసరికి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. రక్తసంబంధీకులనే అంతమొందిస్తున్నారు. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాలో ఇటువంటి రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వరంగ్ అర్బన్ జిల్లా హన్మకొండలో కూరగాయలు విక్రయించి జీవనం కొనసాగిస్తున్నఓ మహిళ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తు చేసిన పోలీసులకు షాక్‌కు గురిచేసే వార్త తెలిసింది. మృతురాలి [&hellip;]</p>

‘మత్తు’లో చిత్తవుతున్న యువత..!
X

దిశ ప్రతినిధి, వరంగల్: గంజాయి మత్తు యువత జీవితాలను నాశనం చేస్తోంది. మత్తుకు అలవాటు పడిన యువకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. సమయానికి మత్తు దొరకకపోయేసరికి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. రక్తసంబంధీకులనే అంతమొందిస్తున్నారు. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాలో ఇటువంటి రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

వరంగ్ అర్బన్ జిల్లా హన్మకొండలో కూరగాయలు విక్రయించి జీవనం కొనసాగిస్తున్నఓ మహిళ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తు చేసిన పోలీసులకు షాక్‌కు గురిచేసే వార్త తెలిసింది. మృతురాలి మేనల్లుడే గంజాయి మత్తుకు అలవాటై డబ్బుల కోసం హత్య చేసినట్లు విచారణలో తేలింది. రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు గంజాయి అలవాటు పడిన యువకుల కూపీ లాగారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది..? అసలు సూత్రధారులెవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

వైజాగ్ నుంచి రవాణా..?

అక్రమ సంపాదనకు అలవాటు పడిన దుండగులు ఒక ముఠాగా ఏర్పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ నుంచి భద్రాచలం మీదుగా మహబూబాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ నుంచి తొర్రూర్ మీదుగా వరంగల్, జనగామ తదితర జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి వంద రూపాయాలకు చొప్పున ధరలు నిర్ణయించిన యువతకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందటే మహబూబాబాద్, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తొర్రూర్‌లో ఎక్సైజ్ అధికారులు పది కిలోల ఎండు గంజాయిని సీజ్ చేసి సరఫరా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మాదిరిగా ప్రతిరోజు పెద్దమొత్తంలో గంజాయి జిల్లాకు ప్రవేశిస్తున్నట్లు సమాచారం.

నిర్లక్ష్యం మాటున..

పోలీసుల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యథేచ్ఛగా ఉమ్మడి జిల్లాలోకి గంజాయి రవాణా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిందితులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్నప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వారి ఆగడాలకు చెక్ పెట్టడం లేదు. దీంతో జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత నిందితులు మళ్లీ అదే దందాకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అక్రమార్కులు కాలేజీ యువతను టార్గెట్ చేసి మత్తుకు బానిసలుగా చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయికి బానిసలైన యువత మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా నేరస్థులుగా మారుతున్నారు. గంజాయికి డబ్బులు దొరకని క్రమంలో దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదని పలు సంఘటనలు ఉదహరిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించి గంజాయి రవాణా అరికట్టేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Next Story