మన్మథుడితో ఇల్లీ బేబీ..

by  |
మన్మథుడితో ఇల్లీ బేబీ..
X

కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో బ్రహ్మాస్త్ర, వైల్డ్ డాగ్, బంగార్రాజు చిత్రాలు చేస్తున్న నాగ్.. ఇప్పుడు మరో సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం. అజయ్ దేవ్‌‌గన్, ఇలియానా నటించిన బాలీవుడ్ మూవీ ‘రైడ్’ను రీమేక్ చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. కాగా జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.

నాగ్ ఈ చిత్రంలో ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. గోవా బ్యూటీ ఇలియానాను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారట. దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ ఉన్న టైమ్‌లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇల్లీ బేబీకి.. అక్కడ ఏవో ఒకటి రెండు హిట్లు తప్ప అనుకున్నంతగా రాణించలేకపోయింది. దీంతో మళ్లీ సౌత్‌లో అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తానని చెబుతున్న ఈ నడుము సుందరి.. నాగ్‌కు ఓకే చెప్తుందనే అనుకుంటున్నారు.


Next Story