- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలో ఇలియానా ‘ది బిగ్ బుల్’
<p>అభిషేక్ బచ్చన్, ఇలియానా డిక్రూజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది బిగ్ బుల్’. ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా 1980-90 మధ్య కాలంలో చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో జూనియర్ బచ్చన్ మెహతా పాత్ర పోషిస్తుండగా.. ఇలియానా, నిఖిత దత్తా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు. కూకి గులాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ, కుమార్ మంగత్ పటక్ నిర్మించారు. కాగా ఈ […]</p>

అభిషేక్ బచ్చన్, ఇలియానా డిక్రూజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది బిగ్ బుల్’. ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా 1980-90 మధ్య కాలంలో చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో జూనియర్ బచ్చన్ మెహతా పాత్ర పోషిస్తుండగా.. ఇలియానా, నిఖిత దత్తా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు.
కూకి గులాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ, కుమార్ మంగత్ పటక్ నిర్మించారు. కాగా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. తన కలలను భారతదేశానికి అమ్మిన వ్యక్తి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉందన్న ఇల్లీ బేబీ.. ఈ చిత్రం నుంచి తన ఫస్ట్ లుక్ షేర్ చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఫైనాన్షియల్ క్రైమ్ త్వరలోనే రివీల్ కాబోతున్నట్లు తెలిపింది.
View this post on InstagramA post shared by Ileana D'Cruz (@ileana_official) on






