క్యాస్టింగ్ కౌచ్ ఉంటే ఉండొచ్చు : అనసూయ

by  |

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బుల్లితెరపై మోస్ట్ గ్లామరస్‌ యాంకర్‌గా పేరొందిది అనసూయ భరద్వాజ్. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. పొట్టిపొట్టి డ్రెస్‌ల్లో తన అందచందాలతో యాంకరింగ్ చేస్తూ.. యూత్‌ను తన వైపు తిప్పుకుంటుందీ అందాల అనసూయ. ఎంబీఏ చదివిన తర్వాత జాబ్ చేస్తూ యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టిన అనూ.. ప్రస్తుతం పలు టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారింది.

అయితే సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వినిపిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అనుసూయ స్పందించింది. పరిశ్రమ క్యాస్టింగ్ కౌచ్ ఉంటే ఉండొచ్చని.. కానీ అది మనం స్పందించే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. ఛాన్సుల కోసం చెత్త పనులు చేయవద్దని హితువు పలికింది. తాను ఎవరి దగ్గరికి ఛాన్సుల కోసం వెళ్లలేదని తెలిపింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని సక్సెస్ సాధించానని చెప్పుకొచ్చిందీ అందాల కుట్టీ.

Next Story

Most Viewed