- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షలు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఎ) బెటాలియన్ 1ను నడిపిస్తున్న సేనాని మడ్వి హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షల నగదు రివార్డు అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే సుకుమా-బీజాపూర్ మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా దళాలను హతమార్చిన దాడిని రచించింది హిడ్మానే కావడం గమనార్హం. ఈ దాడికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు అందుకు తగిన ప్రణాళికలను […]</p>

X
న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఎ) బెటాలియన్ 1ను నడిపిస్తున్న సేనాని మడ్వి హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షల నగదు రివార్డు అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే సుకుమా-బీజాపూర్ మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా దళాలను హతమార్చిన దాడిని రచించింది హిడ్మానే కావడం గమనార్హం. ఈ దాడికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హిడ్మాపై భారీ నగదు రివార్డు ప్రకటించాయి. 2019లో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే భీమా మండవిని చంపిన కేసులోనూ హిడ్మాపై రివార్డు ఉంది.
Next Story






