‘ధోనీ నమ్మకపోతే దేవుడు కూడా కాపాడలేడు’

by  |
‘ధోనీ నమ్మకపోతే దేవుడు కూడా కాపాడలేడు’
X

దిశ, స్పోర్ట్స్: ‘ధోనీ కాపాడలేకపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు’ ఈ వాక్యం చదివితే కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన బద్రీనాథ్ మాత్రం ఇదే 100శాతం నిజం అంటున్నాడు. ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన బద్రి ఇంటర్వ్యూలో సీఎస్కేలో ధోనీ పాత్రను వివరించాడు. ‘ధోనీ ఒక గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, అతనో గొప్ప నాయకుడు. జట్టులోని ఆటగాళ్ల పాత్రే కీలకమని భావిస్తుంటాడు. ధోనీ ఆటగాళ్లందరికీ అదనపు అవకాశాలు ఇస్తుంటాడు. నమ్మిన దానికి కట్టుబడి ఉంటాడు. ఆటగాళ్లందరికీ అవకాశాలిచ్చి వారే నిరూపించుకునేలా చేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు సరిగ్గా ఆడటం లేదని అతను భావిస్తే ఇక ఆ దేవుడు కూడా అతనికి సహాయం చేయలేడు. మా జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉండటంతో టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరం చాంపియన్లుగానే భావిస్తాం’ అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 12 సీజన్లు జరుగ్గా ధోనీ నేతృత్వంలోని సీఎస్కే 9 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. మూడు సార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.



Next Story

Most Viewed