AP News : ఆంధ్ర ప్రదేశ్‌లో తవ్వినా కొద్దీ బంగారమే.. వెలుగులోకి గోల్డెన్ గనులు

by  |
gold mines
X

దిశ, డైనమిక్ బ్యూరో : బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటే.. ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో మాత్రం తవ్వినా కొద్దీ బంగారం దొరికుతుందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ పరిధిలో ఉండే ఖనిజాన్వేషణ విభాగం ఈ నిక్షేపాలపై అధ్యయనం చేసి బంగారం ఉన్నట్లు గుర్తించింది.

ఈ క్రమంలో మొత్తం 10 చోట్ల కలిపి 16 టన్నుల వరకు బంగారం లభ్యమయ్యే నిక్షేపాలున్నట్లు వారు తెలిపారు. అయితే ఒక్క టన్ను మట్టిని తవ్వితే అందులో 4 గ్రాముల బంగారం లభ్యమవుతుందని వారు పేర్కొన్నారు. అనంతపురంలోని జౌకులలో ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులతో కలిపి మొత్తం 97.4 చదరపు కి.మీ. పరిధిలో 16 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిపారు.

AP News : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed