AP News : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు

by  |
Munna
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ దర్యాప్తులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మున్నా నార్కో అనాలసిస్ పరీక్షలకు అంగీకరించాడు. వివేకా హత్య కేసుకు సంబంధించి నార్కో అనాలసిస్ పరీక్షలకు తాను సిద్ధమేనంటూ మేజిస్ట్రేట్ ఎదుట తన అంగీకారం తెలిపాడు. దాంతో పులివెందుల కోర్టు మున్నాకు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతులు మంజూరు చేసింది.

నార్కో అనాలసిస్ పరీక్షల్లో భాగంగా అనుమానితుడు మున్నాను సీబీఐ గుజరాత్ తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సన్నిహితుడు మున్నా. ఇతను పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే వైఎస్ వివేకా హత్య కేసు తర్వాత పులివెందులలోని ఓ బ్యాంకులో మున్నాకు చెందిన లాకర్‌లో రూ.40 లక్షలకు పైగా నగదు గుర్తించడంతో సీబీఐ బృందం మున్నాను అనుమానితుల జాబితాలో చేర్చింది.


Next Story