పెద్ది సినిమా ట్విట్టర్ రివ్యూ...రామ్ చ‌ర‌ణ్ హిట్టు కొట్టిన‌ట్టేనా ?

by velandi.Saikiran |

పెద్ది సినిమా ప్రీమియ‌ర్స్ ప‌డిన త‌రుణంలో ట్విట్టర్ లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది సినిమా ట్విట్టర్ రివ్యూ...రామ్ చ‌ర‌ణ్ హిట్టు కొట్టిన‌ట్టేనా ?
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు బుధవారం రాత్రి పడిపోయాయి. ఈ క్రమంలో సినిమాపైన ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు నెటిజెన్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని.. అతడి ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని వెల్లడిస్తున్నారు. చ‌ర‌ణ్ బాడీ బిల్డింగ్ అందరికీ పిచ్చెక్కిస్తుందని పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో సరికొత్త రామ్ చరణ్ ను చూడవచ్చని పేర్కొంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్ విజిల్స్ వేసేలా చేస్తుందని చెబుతున్నారు.

ఇక బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అందాలు అందరిని కనువిందు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ ఆకట్టుకుంటాయని, ఏఆర్ రెహమాన్ ను మెచ్చుకుంటున్నారు. జగపతిబాబు అప్పలసూరి పాత్ర మరో లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్టోరీలో ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని వెల్లడిస్తున్నారు. శివ రాజ్ కుమార్ పాత్ర ఫస్ట్ ఆఫ్ లో చాలా తక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమాలో క్రికెట్ మ్యాచ్ ల‌ను చాలా సాధారణ ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అయ్యేలా చూపించినట్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు రియల్ హీరోలుగా బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అంటున్నారు. క్లిక్

Next Story