- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy: సెమీ ఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ.. ఫైనల్‌కు న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా(South Africa)పై న్యూజిలాండ్(New Zealand) ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా(South Africa)పై న్యూజిలాండ్(New Zealand) ఘన విజయం సాధించింది. పాకిస్తాన్(Pakistan)లోని లాహోర్(Lahore) మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో కివిస్ విక్టరీ సాధించింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్(Dubai) వేదికగా ఈనెల 9 వ తేదీన జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడనున్నది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. సమిష్టిగా రాణించి సౌతాఫ్రికా ఎదుట భారీ టార్గెట్ పెట్టారు. రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్(102), డారీ మిచెల్(49), ఫిలిప్స్(49) పరుగులతో అదరగొట్టారు. మొత్తంగా 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేశారు.
దీంతో 363 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ రియాన్(17) నిరాశపర్చారు. ఆ తర్వాత కెప్టెన్ టెంబ బావూమా(56), డుస్సేన్(69) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మార్కరమ్(35)తో పర్వాలేదు అనిపించారు. డేవిడ్ మిల్లర్(100) చివరి వరకూ పోరాటం చేసినా నిరాశ తప్పలేదు. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులే చేయగలిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడా రెండు వికెట్లు, వియాన్ ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో సాంటనర్ మూడు వికెట్లు తీయగా, హెన్రి, ఫిలిప్స్ చెరో రెండేసి వికెట్లు తీశారు. బ్రాస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.






