- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎంత దక్కిందో తెలుసా?
టీమ్ ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ట తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. విజేతగా నిలిచిన భారత్‌కు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా.. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచిన విషయం తెలిసిందే. చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు టైటిల్‌తోపాటు దాదాపు రూ.19.48 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే, గ్రూపు దశలో నెగ్గిన ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ. 30 లక్షలు ఐసీసీ అందజేసింది. మూడు గ్రూపు మ్యాచ్‌ల్లోనూ భారత్ నెగ్గగా.. ప్రైజ్‌మనీకి కాకుండా అదనంగా మరో రూ.90 లక్షలు అందాయి.రన్నరప్‌గా నిలిచి న్యూజిలాండ్ రూ. 9.74 కోట్లు అందుకుంది. సెమీస్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ.4.87 కోట్లు చొప్పున పొందుతాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన అఫ్గాన్, బంగ్లాదేశ్ చెరో రూ.3.04 కోట్లు ఇంటికి తీసుకెళ్లగా.. 7, 8 స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ దాదాపు రూ. 1.22 కోట్లు లభించాయి.






