- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
368 బిలియన్ నిమిషాలు.. ఇదీ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఐసీసీ
ఈ ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఏకంగా 368 బిలియన్ నిమిషాల వ్యూయర్‌షిప్ రికార్డు నమోదు చేసిందని ఐసీసీ ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వ్యూయర్‌షిప్‌లో రికార్డులు బద్దలు చేసింది. ఈ టోర్నీ ఏకంగా 368 బిలియన్ నిమిషాల (613 కోట్ల గంటలకుపైగా) వ్యూయర్‌షిప్ నమోదు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ. అంతేకాదు, ఈ మెగా ఈవెంట్లో ప్రతి ఓవర్ 308 మిలియన్ నిమిషాల (51.3 లక్షల గంటలకుపైగా) వ్యూయర్‌షిప్ నమోదు చేసింది. ఏ ఐసీసీ ఈవెంట్లోనైనా ఇదే అత్యధికం కావడం గమనార్హం.
మార్చి 9న భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 65.3 బిలియన్ నిమిషాల (108 గంటలకుపైగా) లైవ్ వ్యూయర్‌షిప్‌తో 2017 ఫైనల్ రికార్డులను బద్దలుకొట్టింది. అంతేకాదు, ఐసీసీ చరిత్రలో అత్యధిక వ్యూయర్‌షిప్ ఉన్న మ్యాచుల్లో మూడో స్థానంలో నిలిచిందీ ఫైనల్. తొలి రెండు స్థానాల్లో భారత్, ఆసీస్ మధ్య జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, అదే టోర్నీలో భారత్, కివీస్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ ఉన్నాయి.






