పాకిస్తాన్‌లో భారత్ పర్యటన గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన ICC

by  |
india pakistan
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న ఎనిమిదేండ్లలో ప్రపంచకప్‌ టోర్నీల వేదికలను గతవారం ICC అధికారికంగా ప్రకటించింది. అయితే 2026లో శ్రీలంకతో కలిసి భారత్‌ T20 ప్రపంచకప్‌కు వేదికవుతుండగా, 2029లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2031లో భారత్‌, బంగ్లాదేశ్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగనుంది. ఎనిమిదేండ్ల వ్యవధిలో BCCI కి మూడు ప్రపంచ టోర్నీలను నిర్వహించే అవకాశం లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ 2025లో చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్నది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయ సిరీస్‌లకు పాక్‌ దూరమైంది.

అయితే చాలా కాలంగా భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరగట్లేదు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్​లో భారత్ పర్యటించడానికి ప్రాధాన్యత చూపించడం లేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్లలో పాక్​లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా అక్కడకు వెళ్తుందా? లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇదే విషయమై స్పందించిన ICC ఛైర్మన్ గ్రెేగ్ బార్క్​లే ఈ పాకిస్తాన్​లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడమనేది సవాలుతో కూడుకున్న విషయం. భౌగోళిక, రాజకీయ విషయాలను నేను అదుపు చేయలేను. కానీ రెండు దేశాల మధ్య సత్సంబంధాల్ని పెంపొందించడానికి క్రికెట్ దోహదపడుతుందని భావిస్తున్నా. ప్రజలు, దేశాలు ఒకేతాటిపై నిలవడానికి క్రీడలు దోహదపడతాయని అని గ్రేగ్ బార్క్‌లే అన్నాడు.


Next Story

Most Viewed