- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 ప్రపంచ కప్‌కు లైన్‌క్లియర్ !
<p>కరోనా వైరస్ ప్రభావంతో.. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వాయిదా పడింది. ఇవేకాక క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ వంటి అనేక టోర్నీల్లో కొన్ని వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్లలో జరగనున్న టీ-20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కానీ, తాజాగా ఐసీసీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో జరగనున్న మార్పులను ప్రకటించి టోర్నీ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించింది. ‘ఐసీసీ టీ-20 […]</p>

కరోనా వైరస్ ప్రభావంతో.. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వాయిదా పడింది. ఇవేకాక క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ వంటి అనేక టోర్నీల్లో కొన్ని వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్లలో జరగనున్న టీ-20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కానీ, తాజాగా ఐసీసీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో జరగనున్న మార్పులను ప్రకటించి టోర్నీ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించింది.
‘ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మానిటరింగ్ కమిటీ కరోనా వైరస్ సంక్షోభంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. మొదట అనుకున్న ప్రకారం ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియాల్లో 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 20 వరకు ఐసీసీ టీ-20 ప్రపంచకప్ నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ అప్పటి వరకు పరిస్థితి అదుపులోకి రానట్టయితే.. టీ20 ప్రపంచ కప్‌ను రద్దు చేయాలని లేదా 2022కు వాయిదా వేయాలనే పలు వాదనలు వినిపిస్తున్నాయి.
Tags: ICC T20WC, Australia, Schedule, Corona, Cricket Fans






