బీజేపీని 'తుక్డే-తుక్డే' చేస్తా.. కన్హయ్య సంచలన వ్యాఖ్యలు

by  |
Kanhaiya Kumar
X

దిశ, వెబ్ డెస్క్: “బీజేపీ నన్ను ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’ అని పిలుస్తోంది.. నేనే బీజేపీని ‘తుక్డే-తుక్డే’ చేస్తా” అంటూ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. కన్హయ్య కుమార్ ఇటీవల ఓ జాతీయ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీపై ఈ విధంగా మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, ‘దేశంలో బీజేపీని గద్దెదించేందుకు సరైన వేదిక కాంగ్రెస్.. అందుకే కాంగ్రెస్ లో చేరా’నంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అదేవిధంగా రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరకుముందు రాహుల్ గాంధీని ఎప్పుడు కలిసినా తన ఆరోగ్యం, తన తల్లిదండ్రుల గురించి అడిగేవారని, అదేవిధంగా రాహుల్ గాంధీ నిజాయితీపరుడు.. రాహుల్ గాంధీ పోరాటంలో చిత్తశుద్ధి ఉన్నట్లు తాను గ్రహించానని కన్హయ్య కుమార్ ఆ ఇంటర్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ తనని తుక్డే-తుక్డే గ్యాంగ్ అని పిలుస్తోందని.. ఇలా పిలుస్తున్న బీజేపీనే ముక్కలు ముక్కలుగా చేస్తానని ఆయన అన్నారు.



Next Story

Most Viewed