2022 నుంచి ఐపీఎల్ రూపురేఖలు మారిపోనున్నాయా.. ?

by  |
2022 నుంచి ఐపీఎల్ రూపురేఖలు మారిపోనున్నాయా.. ?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 నుంచి అన్ని జట్ల రూపురేఖలు మారిపోనున్నాయి. బీసీసీఐ నిబంధనల మేరకు కేవలం ముగ్గురిని మాత్రమే జట్టులో రిటైన్ చేసుకునే అవకాశం ఉండబోతున్నది. ఇందులో కూడా ఒకే విదేశీ ప్లేయర్‌ను ఉంటారు. ఐపీఎల్ 2021 ఫైనల్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తాను జట్టుతోనే ఉంటాను కానీ ఆటగాడిగా ఉంటానని చెప్పలేను అని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్కే జెర్సీతో ఉన్న కార్టూన్‌ను పోస్టు చేశాడు. ఇప్పటికే తాను ఎస్ఆర్‌హెచ్ జట్టును వీడుతున్నట్లు వార్నర్ చెప్పాడు. ధోనీ కూడా నెక్ట్స్ సీజన్‌లో తాను సీఎస్కేతోనే ఉంటాననే క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కొత్త కెప్టెన్ కోసం చెన్నై జట్టు అన్వేషణ మొదలు పెట్టింది. అయితే ఇప్పటికే వార్నర్‌తో సీఎస్కే చర్చలు జరిపిందని.. అందుకే డేవిడ్ తన ఇన్‌స్టాలో ఆ పోస్టు పెట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, డేవిడ్ వార్నర్ ఆ పోస్టును కొద్ది సేపట్లోనే డిలీట్ చేయడం గమనార్హం.



Next Story

Most Viewed