- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పోరడు చేయవట్టి.. నాకు కరోనా వచ్చింది రా భయ్ : కేసీఆర్ ఫన్నీ స్పీచ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ఆదివారం సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా నూతన సమీకృత కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నూతన కమిషనరేట్ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తనకు కరోనా ఎలా సోకిందనే విషయాన్ని నవ్వుతూ తెలియజేశారు. ‘‘కరోనా వల్ల మూతికి బట్ట కట్టుకో.. ఇదేం పంచాయితీయో ఏమో.. నవ్వొస్తోంది. పెండ్లికి పోతే ఓ పెళ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీ’ అన్నాడు. ఎందుకురా భయ్? అంటే […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ ఆదివారం సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా నూతన సమీకృత కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నూతన కమిషనరేట్ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తనకు కరోనా ఎలా సోకిందనే విషయాన్ని నవ్వుతూ తెలియజేశారు.‘‘కరోనా వల్ల మూతికి బట్ట కట్టుకో.. ఇదేం పంచాయితీయో ఏమో.. నవ్వొస్తోంది. పెండ్లికి పోతే ఓ పెళ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీ’ అన్నాడు. ఎందుకురా భయ్? అంటే ‘నువ్వు మళ్లా దొరుకుతావా సర్.. ఫొటో కావాలి’ అన్నాడు. నేను నీకు దొరుకుతానోలేదో మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదరా భయ్ అన్నా. అలా వాడు గుంజి.. వీడు గుంజి నాక్కూడా కరోనా సోకితట్టే చేసిర్రు.. ఇట్ల వచ్చింది కరోనా.’’ అంటూ కేసీఆర్ తన మార్క్ స్పీచ్‌తో అక్కడున్నవారందనీ నవ్వించారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.






