ఆవు ‘మూత్రం’ తాగండి.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పోతుంది..

by Shamantha N |   (  Updated:2021-05-17 05:03:21  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనాను కట్టడి చేసేందుకు ఓ వైపు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల కోసం కష్టపడుతుంటే.. ఎంపీగారు మాత్రం ఆవు మూత్రం తాగితే కరోనా నయం అవుతుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Watch | &quot;I don&#39;t have #Covid because I drink cow urine every day&quot;: BJP MP Pragya Singh Thakur pic.twitter.com/kynaJPzgoi &mdash; NDTV [&hellip;]</p>

ఆవు ‘మూత్రం’ తాగండి.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పోతుంది..
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కరోనాను కట్టడి చేసేందుకు ఓ వైపు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల కోసం కష్టపడుతుంటే.. ఎంపీగారు మాత్రం ఆవు మూత్రం తాగితే కరోనా నయం అవుతుందని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాల ప్రకారం.. ఈరోజు ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కరోనా బారినపడిన వారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ను ఆవు మూత్రం నయం చేస్తుందని అన్నారు. ఆవు మూత్రం తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్ పోతుందని.. తాను కూడా ప్రతీ రోజూ ఆవు మూత్రం తాగడం వల్లే కరోనా బారి నుంచి బయటపడగలుగుతున్నానని వెల్లడించారు. అయితే, 2020 డిసెంబర్‌లోనే ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కరోనా బారినపడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆమె తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story