SRH అంచనాలను మించి రాణిస్తోంది

by  |
SRH అంచనాలను మించి రాణిస్తోంది
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అందరి అంచనాలను మించి రాణిస్తున్నదని, ఇలా ఆడుతుందని తానూ అస్సలు ఊహించలేదని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎలిమినేటర్‌లో బలమైన బెంగళూరు జట్టును ఓడించి క్వాలిఫయర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వార్నర్ సేనను చాలా సాధారణమైన జట్టుగా భావించాను. గతంలో భువనేశ్వర్, రషీద్ ఖాన్‌పైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు బౌలర్లందరూ రాణిస్తున్నారు. హైదరాబాద్ అన్ని మ్యాచ్‌లను గెలుస్తుండటం.. బెంగళూరు జట్టును వరుసగా రెండు సార్లు ఓడించడం చాలా అద్భుతమని ఆయన పేర్కొన్నాడు. చివరి మ్యాచ్‌లో సాహా లేకపోయినా మిగతావాళ్లు రాణించారు. శాబాజ్ నదీమ్ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే టైటిల్ రేసులో ఉంటుంది.



Next Story

Most Viewed