- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్… నేడు హైదరాబాద్ vs పంజాబ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇరుజట్లు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. ఇప్పటికే బౌలింగ్‌ను నమ్ముకుని రాణిస్తున్న హైదరాబాద్ జట్టుకు… గాయం కారణంగా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ టోర్ని నుంచి ఔట్ కావడం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇరుజట్లు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నాయి. ఇప్పటికే బౌలింగ్‌ను నమ్ముకుని రాణిస్తున్న హైదరాబాద్ జట్టుకు… గాయం కారణంగా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ టోర్ని నుంచి ఔట్ కావడం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమాన బలాలు కలిగి ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లతో హైదరాబాద్, యువ ఆటగాళ్లతో రాణిస్తున్న కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్లలో ఏది నెగ్గుతుందో వేచి చూడాలి.
Next Story






