- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో సీన్ రిపీట్.. ఆందోళనలో ప్రజలు.. సమస్య తీరేదెప్పుడు..?
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగర ప్రజలను వరద ముంపు భయం మరోసారి వెంటాడుతూనే ఉంది. ముంపు సమస్యలకు చెక్ పెట్టేందుకు సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం కారణంగా గతంలో నగర ప్రజలు చవిచూసిన చేదు అనుభవాలు పునరావృతం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సుమారు తొమ్మిది నెలల క్రితం 2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కోట్లాది రూపాయల […]</p>

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగర ప్రజలను వరద ముంపు భయం మరోసారి వెంటాడుతూనే ఉంది. ముంపు సమస్యలకు చెక్ పెట్టేందుకు సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం కారణంగా గతంలో నగర ప్రజలు చవిచూసిన చేదు అనుభవాలు పునరావృతం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సుమారు తొమ్మిది నెలల క్రితం 2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కోట్లాది రూపాయల ఆస్తి, ప్రాణ నష్టం సైతం సంభవించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే నెలల పాటు వరద నీరు అలాగే ఉండిపోయింది. ఆ సమయంలో హైదరాబాద్ ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం.
ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని, భవిష్యత్‌లో ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు తాజాగా వర్షాకాలం ఆరంభంలోనే వరద నీరు నగరాన్ని ముంచెత్తడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం అత్యధికంగా సుమారు 9 సెం.మీ వర్షాపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లోని బస్తీలను పెద్ద ఎత్తున వరద నీరు ముంచెత్తింది. వాహనాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. చెట్లు కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలతో ప్రజలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రారంభంలోనే ఇలా ఉంటే.. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.






