- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'హీరో' పేరుతో మోసం చేస్తున్న 'విలన్' అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయ్‌ను మాట్లాడుతున్నాను అంటూ అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని కనిపెట్టిన విజయ్ టీం.. అతనితో అమ్మాయిలా చాట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో అతను నిజంగానే అమ్మాయి అనుకుని డీప్ చాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ రావాలని విజయ్ టీం నిందితుడిని కోరగా.. పిలిచింది నిజంగానే అమ్మాయి అనుకుని వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాడు. దీంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయ్‌ను మాట్లాడుతున్నాను అంటూ అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని కనిపెట్టిన విజయ్ టీం.. అతనితో అమ్మాయిలా చాట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో అతను నిజంగానే అమ్మాయి అనుకుని డీప్ చాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ రావాలని విజయ్ టీం నిందితుడిని కోరగా.. పిలిచింది నిజంగానే అమ్మాయి అనుకుని వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాడు. దీంతో అప్పటికే పోలీసులతో రెడీగా ఉన్న విజయ్ టీం… మోసగాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. నిందితుడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా… దాదాపు పది మంది విజయ్ లేడీ ఫ్యాన్స్‌ను మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా… విజయ్ దేవరకొండ పేరుతో ఎవరు మెసేజ్, కాల్ చేసినా నమ్మొద్దని.. జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌కు సూచించింది విజయ్ టీం.
tags : Vijay Devarakonda, Rowdy Hero, Fake Id






