హుజురాబాద్‌లో ముగిసిన పోలింగ్

by Shyam |   (  Updated:2021-10-30 08:07:54  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లకు, మిగతా గంట కోవిడ్, ఇతర వ్యాధులు సోకిన ఓటర్లకు అవకాశం కల్పించారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తడంతో గతేడాది కంటే రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే, పోలింగ్ సమయం ముగియడంతో ఓటర్లకు [&hellip;]</p>

TRS vs BJP Veenavanka
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లకు, మిగతా గంట కోవిడ్, ఇతర వ్యాధులు సోకిన ఓటర్లకు అవకాశం కల్పించారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తడంతో గతేడాది కంటే రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే, పోలింగ్ సమయం ముగియడంతో ఓటర్లకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

Next Story