- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగ, ప్రతీకారం తీర్చుకోవడానికే హుజురాబాద్ ఎన్నికలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రమైనా ఉపయోగముంటుందా అని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగం జరగని ఎన్నికల్లో తాను పోటీ చేసేదిలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఎలక్షన్ల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడెకరాల భూమి వస్తుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చితే అప్పుడు తమ పార్టీ పోటీలో ఉంటుందని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికలు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమాత్రమైనా ఉపయోగముంటుందా అని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగం జరగని ఎన్నికల్లో తాను పోటీ చేసేదిలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఎలక్షన్ల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడెకరాల భూమి వస్తుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చితే అప్పుడు తమ పార్టీ పోటీలో ఉంటుందని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికలు కేవలం పగ, ప్రతీకారం కోసం మాత్రమే జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాను ఒంటరి కాదని, తెలంగాణలో వైఎస్సార్ అభిమానులంతా తనకు అండగా ఉన్నారని షర్మిల ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Next Story






