- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భర్తకు మందు తాగించి.. భార్యను రేప్ చేసి చంపేశారు
<p>దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నమ్మి ఇంటికి తీసుకొచ్చిన పాపానికి.. వెంట తిరిగే స్నేహితులే భార్యపై అఘాయిత్యం చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తారామతిపేటలో బతుకుదెరువు కోసం వచ్చి గత కొన్నాళ్లుగా నివాసముంటున్న వ్యక్తికి… అదే ఊరిలోని ఇద్దరు యువకులతో స్నేహం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తులు అతని భార్యపై కన్నేశారు. సోమవారం రాత్రి ఆ వ్యక్తి ఇంటికి […]</p>

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నమ్మి ఇంటికి తీసుకొచ్చిన పాపానికి.. వెంట తిరిగే స్నేహితులే భార్యపై అఘాయిత్యం చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తారామతిపేటలో బతుకుదెరువు కోసం వచ్చి గత కొన్నాళ్లుగా నివాసముంటున్న వ్యక్తికి… అదే ఊరిలోని ఇద్దరు యువకులతో స్నేహం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తులు అతని భార్యపై కన్నేశారు. సోమవారం రాత్రి ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ఫుల్‌గా మద్యం తాగారు. భర్తకు స్పృహ కోల్పోయేలా మద్యం తాగించేసరికి అతడు నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సమయంలో భార్యపై బలవంతంగా అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించే సరికి హతమార్చారు. నిందితుల్లో ఒకరైన సురేష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






