నదిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలు

by  |
నదిలో కొట్టుకుపోతున్న భార్యాభర్తలు
X

అరుణాచల్ ప్రదేశ్: అరుణాచ్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. పసిఘాట్ లో శిబో కోరంగ్ నది ఉప్పొంగి పొర్లుతోంది. ఈ నదిలో ఇద్దరు దంపతులు కొట్టుకుపోయారు. అయితే ఈ విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు విపత్తు నిర్వహణ శాఖకు సమాచారమందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వారిని తాళ్ల సహాయంతో రక్షించగలిగారు. మీ వల్లే మేం ప్రాణాలతో బతికి బయటపడ్డామంటూ అధికారులకు, స్థానికులకు ఆ దంపతులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story