భార్యపై అమానుషం..అందరు చూస్తుండగానే నడిరోడ్డుపై..!

129

దిశ, వెబ్‎డెస్క్: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హరీశ్‌, భార్యతో కలిసి బుధ్‌ విహార్‌ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తుండేవాళ్లు. అయితే, హరీష్ గత కొద్ది రోజులుగా భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించసాగాడు. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. గొడవలో ఆగ్రహానికి లోనైన హరీష్ కత్తితో భార్యపై దాడి చేయబోతుంటే తప్పించుకొని రోడ్డుపైకి వచ్చింది. దీంతో నడిరోడ్డుపైననే విచక్షణ రహితంగా భార్యపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా, దగ్గరికి వస్తే మీకూ.. ఇదే గతి అంటూ…ఆమె చనిపోయాక అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..