భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్ : అనుమానంతో భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొట్టావారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భార్య గాయిత్రిపై అనుమానం పెంచుకున్న భర్త దిలీప్.. బుధవారం ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిలీప్ ను గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు [&hellip;]</p>

భార్యను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్ :
అనుమానంతో భార్యను హత్య చేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొట్టావారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భార్య గాయిత్రిపై అనుమానం పెంచుకున్న భర్త దిలీప్.. బుధవారం ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిలీప్ ను గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story