- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టించిన భార్య
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బంధువులను నమ్మించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌లో మే 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేశ్ అనే వ్యక్తి చనిపోయాడు. బంధువులందరూ మొదట రోడ్డు ప్రమాదమే అనుకున్నారు. అయితే రోజులు గడిచేకొద్ది భార్యకు భర్త చనిపోయాడన్న బాధ లేకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. సురేశ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బంధువులను నమ్మించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌లో మే 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేశ్ అనే వ్యక్తి చనిపోయాడు. బంధువులందరూ మొదట రోడ్డు ప్రమాదమే అనుకున్నారు. అయితే రోజులు గడిచేకొద్ది భార్యకు భర్త చనిపోయాడన్న బాధ లేకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. సురేశ్ మృతికి భార్యే కారణం అయిఉండొచ్చన్న అనుమానంతో బంధువులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేశ్ భార్యను పలుమార్లు విచారించగా.. అసలు గుట్టు బయటపెట్టింది. ప్రియుడి సహాయంతో భర్తను డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టించి హత్య చేయించినట్లు సురేశ్ భార్య ఒప్పుకుంది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






