భార్యను నరికి చంపి.. భర్త ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-05-06 00:05:14  IST  )

<p>అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కత్తిపీటతో నరికి చంపి అనంతరం భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోగల్లు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (65) కొద్దిరోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య సత్యవతి (60)ని కత్తిపీటతో నరికి చంపేశాడు. అనంతరం ఆయన కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, హత్యకు గల కారణాలపై విచారణ [&hellip;]</p>

భార్యను నరికి చంపి.. భర్త ఆత్మహత్య
X

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కత్తిపీటతో నరికి చంపి అనంతరం భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోగల్లు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (65) కొద్దిరోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఆయన భార్య సత్యవతి (60)ని కత్తిపీటతో నరికి చంపేశాడు. అనంతరం ఆయన కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

Tags : Husband, murder, wife, suicide, West Godavari, police

Next Story