మద్యానికి డబ్బులివ్వలేదని నిద్రిస్తున్న భార్యపై దారుణం

93

దిశ, మక్తల్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపాడో భర్త. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గ పరిధి పెద్దకడుమూరులో జరిగింది. నర్వ ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్వ మండలం పెద్ద కడుమూర్ గ్రామానికి చెందిన మున్నెప్పు(40) తాగుడుకి అలవాటు పడ్డాడు. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే భార్యను రోజూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తూ కొట్టేవాడు. బుధవారం రాత్రి కూడా మద్యం కోసం డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవ పడ్డాడు. దీంతో డబ్బులు లేవని భార్య శ్యామలమ్మ సమాధానం ఇచ్చింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నిద్రిస్తున్న భార్య గొంతుకు నూలుతాడును బిగించి హత్య చేశాడని.. మృతురాలి సోదరుడు గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పుకొచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..