- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను గొడ్డలితో నరికిన భర్త..
by Batti.Sumithra |
<p>దిశ, ఇబ్రహీంపట్నం : తప్పతాగిన ఓ భర్త భార్యను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. యాచారం మండలం తక్కళ్ళపల్లి తండా గ్రామంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. రమావత్ శ్రీను,లలిత దంపతులు. భర్త శ్రీను నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి భార్యతో గొడవ పడుతున్నాడు. ఏమైందో తెలీదు కానీ, ఉదయం చూసే సరికి లలిత రక్తపు మడుగులో పడి […]</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం : తప్పతాగిన ఓ భర్త భార్యను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. యాచారం మండలం తక్కళ్ళపల్లి తండా గ్రామంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. రమావత్ శ్రీను,లలిత దంపతులు. భర్త శ్రీను నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి భార్యతో గొడవ పడుతున్నాడు. ఏమైందో తెలీదు కానీ, ఉదయం చూసే సరికి లలిత రక్తపు మడుగులో పడి ఉంది.
విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. రాత్రి 11గంటల ప్రాంతంలో నేరం జరిగినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






