- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళ్ళు పట్టుకున్న భర్త.. కనికరించని భార్య ఏం చేసిందంటే..
<p>దిశ,వెబ్ డెస్క్: ఆధునిక సమాజంలో వివాహ బంధంకు విలువ లేకుండా పోయింది. పెళ్ళిలో ఏడడుగులు వేసి కలకాలం కలిసి ఉంటామని చేసుకున్న ప్రమాణాన్ని మరిచి చిన్న చిన్న గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటనే ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే టప్పల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో కొన్నేళ్ల […]</p>

దిశ,వెబ్ డెస్క్: ఆధునిక సమాజంలో వివాహ బంధంకు విలువ లేకుండా పోయింది. పెళ్ళిలో ఏడడుగులు వేసి కలకాలం కలిసి ఉంటామని చేసుకున్న ప్రమాణాన్ని మరిచి చిన్న చిన్న గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటనే ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే టప్పల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి అదే గ్రామానికి చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ జంట మధ్య మరో యువకుడు అడుగుపెట్టాడు. సదరు యువతి ఆ యువకుడిని ప్రేమిస్తున్నానంటూ భర్తతో గొడవకు దిగింది. దీంతో ఈ గొడవ కాస్తా కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో భర్త భార్యను వెళ్ళొద్దని బ్రతిమిలాడాడు. అందరు చూస్తుండగానే రోడ్డు మీద తన భార్య కాళ్ళు పట్టుకొని, తనతోనే ఉండాలని ప్రాధేయపడ్డాడు. తనకోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఉండమని కోరాడు. కానీ ఎంతకీ వినని ఆ భార్య భర్తను వదిలి ప్రియుడు బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.






