‘నీ భార్యే నీకు శని.. ఆమెను వదిలేస్తేనే ఎమ్మెల్యే అవుతావ్..’

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-13 05:51:48  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : నేటి అత్యాధునిక సమాజంలో ఎక్కడో ఓ చోటు మూఢనమ్మకాల మరకలు పడుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది. ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని తన భార్యను చిత్రహింసలకు గురిచేశాడో వ్యక్తి. అత్త, మామ లు కూడా కట్టుకున్న భర్తకు వంతపాడడంతో వారి వేధింపులు తాళలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని పూణే పట్టణానికి చెందిన రఘునాథ్ అనే రాజకీయ నాయకుడు.. [&hellip;]</p>

cartoon wife husband
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి అత్యాధునిక సమాజంలో ఎక్కడో ఓ చోటు మూఢనమ్మకాల మరకలు పడుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది. ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని తన భార్యను చిత్రహింసలకు గురిచేశాడో వ్యక్తి. అత్త, మామ లు కూడా కట్టుకున్న భర్తకు వంతపాడడంతో వారి వేధింపులు తాళలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని పూణే పట్టణానికి చెందిన రఘునాథ్ అనే రాజకీయ నాయకుడు.. హస్త రేఖలు చూసి జాతకం చెప్పే జ్యోతిష్కుడి వద్దకు వచ్చాడు.

ఆ జ్యోతిష్కుడు రఘునాథ్ చేతిలోని రేఖలు చూసి.. ‘నీ భార్యే నీకు శని.. ఆమె ఉన్నంత వరకు నీకు ఉన్నత పదవులు రావు, ఎమ్మెల్యే, మంత్రి కాలేవు’ అని చెప్పాడు. ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు రఘునాథ్ మదిలో బలంగా నాటుకోవడంతో.. ఇంటికి వచ్చిన రఘునాథ్ తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. భర్త తీరును అత్త, మామలకు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. వారు కూడా భర్తకు సహకరించి వేధింపులకు గురి చేయడంతో.. సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో రఘునాథ్.. జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు వెల్లడించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం సదరు జ్యోతిష్యుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

అంతరిక్షంలోకి రాకెట్లను పంపి విశ్వ ప్రయాణం చేస్తున్నా.. కొందరు మాత్రం ఉన్న చోటే ఉంటూ.. వారి మెదడులో లేనిపోని అనుమానాలకు ఆజ్యం పోస్తూ.. ఈ జ్యోతిష్యుడు లాంటి వారి జేబులు నింపడమే కాకుండా జీవితాలను కూడా అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. మనషుల కోసం జాతకాలు, సంప్రదాయాలు కానీ.. జాతకాలు, సంప్రదాయాల కోసం మనుషులు కాదు అని చర్చించుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వాళ్లు.

Next Story