- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యాభర్తల మధ్య గొడవ.. మనస్థాపంతో ఉరేసుకున్న భర్త..
<p>దిశ చౌటుప్పల్: భార్యాభర్తల మధ్య కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎనగంటి తండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎనగంటి తండా కు చెందిన పానుగోతు లక్కు చిన్న కుమారుడు సుమన్(26) వివాహం నారాయణపురం మండలం తుంబావి తండాకు చెందిన జర్పుల రోజా తో గత సంవత్సరం మార్చిలో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ బాబు జన్మించాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో […]</p>

దిశ చౌటుప్పల్: భార్యాభర్తల మధ్య కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎనగంటి తండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎనగంటి తండా కు చెందిన పానుగోతు లక్కు చిన్న కుమారుడు సుమన్(26) వివాహం నారాయణపురం మండలం తుంబావి తండాకు చెందిన జర్పుల రోజా తో గత సంవత్సరం మార్చిలో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ బాబు జన్మించాడు.
వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం ఉదయం తెల్లవారుజామున తన భార్య రోజా నిద్రిస్తున్న సమయంలో సుమన్ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య గొడవలే తన కుమారుడి ఆత్మహత్యకు కారణమని మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మృతుని కుమారునికి 11 నెలల వయస్సు. మృతుని తండ్రి లకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సిఐ ఎన్.శ్రీనివాస్ తెలిపారు.







