- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య అలా చేసిందని కత్తితో పొడిచాడు…
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు కన్యాకుమారి జిల్లా తిరుమలైపురంలో ఓ భర్త వీరంగం సృష్టించాడు. భార్య విడాకుల నోటీసులు పంపిందని కోపోద్రిక్తుడైన వ్యక్తి.. ఆమెపై కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే భార్య జోషి పై అనుమానం పెంచుకున్న సతీష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండేవి. దీంతో భార్య జోషి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన సతీష్… భార్య పని చేసే ఆఫీసుకు వెళ్లిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు కన్యాకుమారి జిల్లా తిరుమలైపురంలో ఓ భర్త వీరంగం సృష్టించాడు. భార్య విడాకుల నోటీసులు పంపిందని కోపోద్రిక్తుడైన వ్యక్తి.. ఆమెపై కత్తితో దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే భార్య జోషి పై అనుమానం పెంచుకున్న సతీష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండేవి.
దీంతో భార్య జోషి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోపోద్రిక్తుడైన సతీష్… భార్య పని చేసే ఆఫీసుకు వెళ్లిన ఆమెని కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు స్థానికులు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో భార్య జోషికి తీవ్రగాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






