- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా దారుణం.. అక్కడిక్కడే భార్యభర్తలు
by Batti.Sumithra |
<p>దిశ, కౌడిపల్లి: ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఏర్పుల జోగయ్య(54), దుర్గమ్మ(50) భార్య భర్తలు. వీరు ఆదివారం తునికి నల్ల పోచమ్మ దేవాలయం వద్ద బంధువులు జరిపిన శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగియడంతో తిరిగి రంగంపేటకు వస్తున్న క్రమంలో ధర్మసాగర్ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు భార్యాభర్తలు […]</p>

X
దిశ, కౌడిపల్లి: ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఏర్పుల జోగయ్య(54), దుర్గమ్మ(50) భార్య భర్తలు. వీరు ఆదివారం తునికి నల్ల పోచమ్మ దేవాలయం వద్ద బంధువులు జరిపిన శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగియడంతో తిరిగి రంగంపేటకు వస్తున్న క్రమంలో ధర్మసాగర్ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోగయ్య గత 30 సంవత్సరాలుగా రంగంపేట గ్రామపంచాయతీలో వాటర్ మెన్‌గా పనిచేస్తూ గ్రామంలో అందరితో కలగోలుపుగా ఉండేవాడు. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఒకేసారి మృతిచెందడంతో రంగంపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






