- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. భార్య డెలివరీ కోసం వెళ్తూ.. భర్త, మూడేళ్ల కూతురు మృతి
<p>దిశ, కామారెడ్డి : ఆ చిట్టితల్లికి మూడేళ్ల వయసు. తన తర్వాత తమ్ముడో, చెల్లెలో రాబోతుంది అనే సంతోషంలో ఆ పాప ఉంది. ఇంతలో ఆ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టబోయే తన తోబుట్టువును చూడకుండానే ఆ చిట్టి తల్లి అకాల మరణం పొందింది. ఆ చిట్టితల్లితో పాటు తండ్రి కూడా మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం గోలిపర్తి […]</p>

దిశ, కామారెడ్డి : ఆ చిట్టితల్లికి మూడేళ్ల వయసు. తన తర్వాత తమ్ముడో, చెల్లెలో రాబోతుంది అనే సంతోషంలో ఆ పాప ఉంది. ఇంతలో ఆ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టబోయే తన తోబుట్టువును చూడకుండానే ఆ చిట్టి తల్లి అకాల మరణం పొందింది. ఆ చిట్టితల్లితో పాటు తండ్రి కూడా మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం గోలిపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ భార్య గంగమణి గర్భవతి కావడంతో డెలివరీ కోసం రాజంపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించేందుకు మూడేళ్ళ కూతురు మోక్షతో కలిసి బైకుపై బయలుదేరారు.
ఈ క్రమంలో భిక్కనూరు మండలం సిద్దరామేశ్వర్ నగర్ శివారులో జాతీయ రహదాహరిపై బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కూతురు మోక్ష అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్, గంగమణిలను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. శ్రీనివాస్ భార్య గంగమణి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల కూతురు, తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






