- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కాటుకు నిన్న భార్య నేడు భర్త మృతి
<p>దిశ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులలో విషాదం చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో శనివారం వంగోజు వజ్రమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందగా ఆదివారం ఆమె భర్త వంగోజు రాజయ్య (70) మృతి చెందాడు. భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు వ్యవధిలోనే కరోనా కారణంగా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృత దేహాలకు అంత్య క్రియలు నిర్వహించారు. కరోనా మహమ్మారి కుటుంబాలను కబళిస్తుండడంతో […]</p>

దిశ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులలో విషాదం చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో శనివారం వంగోజు వజ్రమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందగా ఆదివారం ఆమె భర్త వంగోజు రాజయ్య (70) మృతి చెందాడు. భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు వ్యవధిలోనే కరోనా కారణంగా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృత దేహాలకు అంత్య క్రియలు నిర్వహించారు.
కరోనా మహమ్మారి కుటుంబాలను కబళిస్తుండడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ప్రయివేటు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించి చికిత్స పొందలేక, మరో వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చాల మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోవడంతో పాటు విలువైన కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు కోలుకోలేనంతగా దెబ్బటంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






