ఆస్పత్రిలో డాక్టర్ల సౌకర్యం కల్పించండి.. స్ధానిక నేతల డిమాండ్

by  |
nayakulu
X

దిశ,మణుగూరు : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిచ్చితుగ్లక్ పరిపాలన చేస్తున్నాడని, ఈనాటి ప్రభుత్వంలో ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని తుడుందెబ్బ రాష్ట్రకమిటీ బృంద నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, రాష్ట్రప్రచార కార్యదర్శి అలెం కోటి అన్నారు. గురువారం మండలంలోని వందపడకల ఆసుపత్రిని సందర్శించారు. తెలంగాణ వస్తే ప్రజలకు హెలికాప్టర్ లో వైద్య సేవలు అందిస్తానని అన్నమాటలు ఎక్కడకి పోయాయని ఘాటుగా విమర్శించారు. ఏడు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడ్డదో వివరించాలని ప్రశ్నించారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో నాలుగు మండలాల ప్రజలకోసం వందపడకల ఆసుపత్రిని నిర్మించారు. కానీ అందులో కనీసం ఒక డాక్టర్ కూడా లేరని ప్రశ్నించారు.

ఏజెన్సీలో వైద్యం లేక గిరిజనుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం తమాషా చూస్తోందా అని మండిపడ్డారు. గిరిజనులకు వైద్యం లేకనే విషజ్వరాలతో తదితరుల జబ్బులతో నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులక్రితం కరకగూడెం మండలంలో మూడు నెలల పసికందు నాటు వైద్యానికి బలైనాడు. అదే వందపడకల ఆసుపత్రిలో వైద్యుడు ఉంటే భద్రాచలం ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరంలేదన్నారు. అదే సమయంలో వందపడకల ఆసుపత్రిలో వైద్యులు ఉంటే ఒక పసికందు భూమి ఉండేది వ్యాఖ్యానించారు.

ఏజెన్సీప్రాంతంలో గిరిజనులు విషజ్వరాలతో వరుసగా మంచాలు పట్టారు. సరైన వైద్యం లేక, ప్రవేట్ ఆసుపత్రికి వెళ్లడానికి డబ్బులు లేక అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. గిరిజనుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా.. అని ప్రశ్నించారు. బిడ్డ కేసిఆర్ నీపాపం పండే రోజు ముందు ఉంది చూసుకో..ప్రజల తిరగపడే సమయం ఆసన్నమైందని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రజలకోసం వందపడకల ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు పాయం పూర్ణచందర్రావు, చంద తరుణ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story