హమ్మింగ్‌ బర్డ్స్.. రంగుల కళ

by  |
హమ్మింగ్‌ బర్డ్స్.. రంగుల కళ
X

దిశ, వెబ్‌డెస్క్ :
మనుషులతో పోల్చితే కలర్ విజన్.. పక్షుల్లో బెటర్‌గా ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ మనుషులు చూడలేని రంగుల్ని కూడా బుల్లిపిట్ట ‘హమ్మింగ్ బర్డ్’ చూడగలుగుతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. మన నేత్రాలు.. మూడు విధాలైన రంగుల్ని గుర్తించగలుగుతాయి. దాన్నే ‘ట్రైక్రోమాటిక్’గా వ్యవహరిస్తారు. ఆ రంగులే బ్లూ, గ్రీన్, రెడ్. అదే హమ్మింగ్ బర్డ్ విషయానికి వచ్చేసరికి అదే టెట్రాక్రోమాటిక్ అని తెలిసింది.

ట్రైక్రోమాటిక్ ఆధారంగా మనం.. ఇంద్రధనస్సులోని రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వాయిలెట్ రంగుల్ని గుర్తించగలుగుతాం. వీటినే స్పెక్టాక్యులర్ కలర్స్‌గా చెబుతారు. అయితే.. నాన్ స్పెక్టాక్యులర్‌కు సంబంధించి మానవులు పర్పుల్ రంగుని మాత్రమే చూడగలుగుతారు. ఎందుకంటే.. అది రెడ్, బ్లూ ఆధారంగా ఏర్పడుతుంది. అదే పక్షుల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా హమ్మింగ్ బర్డ్స్ మనకంటే మెరుగైన రంగుల్ని గుర్తించగలుగుతాయి. అల్ట్రావయోలెట్ రంగుల్ని కూడా అవి గుర్తిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. యూవీ-గ్రీన్, యూవీ-రెడ్. కొలరాడోకు సమీపంలోని రాకీమౌంటెన్‌ బయాలాజికల్‌ లేబొరేటరీ ప్రాంతంలో హమ్మింగ్‌ బర్డ్స్‌పై ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను తేల్చారు. కాగా ఈ అధ్యయనం ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’లో ప్రచురితమైంది. మనుషుల కంటికి కనిపించని కొన్ని వేల రంగుల్ని అవి గుర్తించగలుగుతాయిని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. ఈ రంగుల ఆధారంగానే భిన్నమైన చెట్లు, మొక్కలను గుర్తించి వాటిల్లోని మకరందాన్ని ఇవి తాగుతుంటాయి. ఇవి మామూలు గ్రీన్ కలర్‌కు, యూవీ గ్రీన్ కలర్‌కు తేడాను కూడా కనిపెట్టగలవని శాస్ర్తవేత్తలు తెలిపారు.


Next Story

Most Viewed