స్పెషల్ సాంగ్‌లో హుమా ఖురేషి

by  |
స్పెషల్ సాంగ్‌లో హుమా ఖురేషి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆలియా భట్ లీడ్ రోల్ చేస్తున్న బాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘గంగుబాయి కథియావాడి’. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా, జయంతిలాల్‌ గడాతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబై కామతిపూరను శాసించిన లేడీ డాన్‌గా పేరున్న గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సల్ హీరోయిన్‌ను వెతుకుతున్నారట. సంజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశమొస్తే తప్పక చేస్తానని హుమా ఖురేషి అన్నట్లు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే సంజయ్ చిత్రాల్లో సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం మూవీ యూనిట్ త్వరలో హుమా ఖురేషిని సంప్రదిస్తారని సమాచారం.

Next Story