Huma Qureshi: ఇంకా ఏం నిరూపించుకోవాలి? : హీరోయిన్

by  |
Huma Qureshi: ఇంకా ఏం నిరూపించుకోవాలి? : హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్, మోడల్ హ్యూమా ఖురేషి ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ‘లైలా’ సిరీస్ తర్వాత ‘మహారాణి’‌లో నటిస్తున్న భామ.. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో కనిపించనుంది. కరణ్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 28 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హ్యూమా ఖురేషి తను పోషిస్తున్న పాత్రలకు సంబంధించి, ప్రత్యేకించి ‘మహారాణి’లో పర్టిక్యులర్ స్లాంగ్‌ను ఏ విధంగా మాట్లాడగలిగిందో వెల్లడించింది. ఒకటి రెండుసార్లు వింటే చాలు.. క్యారెక్టర్‌కు సంబంధించిన స్లాంగ్‌ను ఈజీగా క్యాచ్ చేస్తానన్న భామ.. ఈ విషయంలో తనను తాను ఓ మిమిక్రీ ఆర్టిస్టుగా భావిస్తుంటా అని చెప్పింది. ఇక ఈ సిరీస్‌ కోసం ముంబయిలో నిర్వహించిన వర్క్‌షాప్ బాగా ప్లస్ అయినట్టు తెలిపింది. అంతేకాదు ఇదే యాక్సెంట్‌ను ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’లోనూ యూజ్ చేశానని, కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదని పేర్కొంది.

తను సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకోవడం పట్ల స్పందించిన హ్యూమా.. ‘నేను ఎప్పుడు ఆఫర్ల కోసం పరుగెత్తను, అలా అయితే ఎక్కువ క్యారెక్టర్లు చేస్తామే తప్ప, గుర్తుండిపోయే పాత్రలు చేయలేం. అయినా విరామం లేకుండా ఎందుకు పనిచేయాలి? ఇంకా నేనేం నిరూపించుకోవాలి? నా కెరీర్ ముగిశాక వెనక్కి తిరిగి చూసుకుంటే, డిఫరెంట్ రోల్స్ చేశాననే విషయాన్ని ప్రేక్షకులు గుర్తిస్తే చాలు’ అని చెప్పుకొచ్చింది.

Image

Image

Next Story

Most Viewed