సెల్‌ఫోన్ వినియోగదారులకు భారీ షాకింగ్ న్యూస్!

by  |

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రజలపై మరో భారం పడనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సెల్ ఫోన్​సంస్థలు ప్రీపెయిడ్​రీఛార్జ్ టారిఫ్ లను 20% పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక జియో మినహా అన్ని కంపెనీలూ తమ టారీఫ్​లపై కొత్త ధరలు అమలు చేస్తున్నాయి. జియో సైతం త్వరలో తమ టారీప్ లను పెంచుతుందని మార్కెట్​వర్గాలు అంచనావేస్తున్నాయి. ఎంత శాతం వరకు పెరుగుతాయనేది ఇంకా తేలాల్సి ఉంది. సెల్​ఫోన్ ఇప్పుడు మన జీవితంలో తప్పనిసరి అయింది. ఒకప్పుడు దూర ప్రాంతంలో ఉన్న మనవారి యోగ క్షేమాల కోసం మాత్రమే ఉపయోగించిన సెల్​ఫోన్ ఇప్పుడు నిత్యజీవితంలో భాగంగా మారింది. బ్యాంకు ఖాతాలు, ఏదైనా దరఖాస్తు చేస్తే వచ్చే ఓటిపీలకు, వాట్సాప్, ఫేస్​బుక్, సోషల్ మీడియా ప్లాట్​ఫాంలకు సైతం సెల్ ఫోనే శరణ్యం. కరోనా నేపథ్యంలో ఆన్​లైన్ క్లాస్ లకు మొబైల్​ఫోన్ ​అవసరంగానే మారింది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో రెండు సెల్ ఫోన్ల కన్నా తక్కువగా ఉన్న ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నెట్ వర్క్​ను బట్టి కోట్లాది మంది ప్రజలు ప్రస్తుతం వివిధ రకాల నెట్​వర్క్ సిమ్​లు తీసుకొని సెల్ ఫోన్ సేవలు పొందుతున్నారు. దేశంలో సెల్​ఫోన్​ఉపయోగిస్తున్నవారిలో మెజారిటీ ప్రజలు వారి అవసరాలను బట్టి ప్రీపెయిడ్ నే ఎంచుకుంటున్నారు. పోస్టు పెయిడ్ వినియోగదారులు మన దేశంలో తక్కువని చెప్పుకోవాలి. కస్టమర్ల అవసరాలను బట్టి ఆయా సెల్ ఫోన్​కంపెనీలు వివిధ రకాల టారీప్​లను అందుబాటులో ఉంచాయి. టారిఫ్​లను బట్టి ఇందులో ప్రతిరోజు కాల్స్, ఎస్ఎంఎస్, డేటాను అందిస్తున్నాయి.

రేపటి నుంచి మోత​

దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్​తదితర కంపెనీలు శుక్రవారం నుంచి ప్రతి రీఛార్జ్ పై 20% అదనంగా వసూలు చేయనుంది. ఉదాహరణకు ఏడాది పాటు అన్​లిమిటెట్ కాల్స్​, రోజుకు 100 ఎస్ఎంఎస్​లు, 1.5 లేదా 2జీబీ డేటా కోసం రూ. 2,399 ఉంటే ఇకపై రూ. 2899 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ అన్​లిమిటెడ్ కాల్స్,​300 ఎస్​ఎంఎస్​లు, 2జీబీ డాటాతో 28రోజుల వ్యాలిడిటీ ప్రస్తుతం రూ.149 కాగా ఇకపై రూ.179 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని టారిఫ్​లపై పెరిగిన ధరల ప్రభావం ఉంటుంది.

జియో కస్టమర్లకు భారం ఇప్పుడే లేనట్టే!

జియో కస్టమర్లకు ప్రస్తుతానికి పెంపు భారం ఉండదు. ధరలు​పెంచుతున్నట్టు ఆ సంస్థ ఎక్కడా ప్రకటించ లేదు. ప్రస్తుతం పాత ధరలతోనే ప్రీపెయిడ్​రీఛార్జ్ లు అమల్లో ఉంటాయి. రానున్న రోజుల్లో జియో సైతం పెంచే అవకాశం ఉన్నట్టు మార్కెట్​వర్గాలు చెబుతున్నాయి.

దేశ ప్రజలపై కోట్ల భారం

ప్రస్తుతం సర్వీస్​ప్రొవైడింగ్ సంస్థలు ప్రీపెయిడ్​రీఛార్జ్ లపై 20% ధరలు పెంచడంతో దేశ వ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. 2020 మార్చిలో ప్రారంభమైన కరోనా దేశ ఆర్ధిక వ్యవస్థలపై పేద, మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఫలితంగా రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు తోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల మంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఈ పెంపు గోరుచుట్టుపై రోకటి పోటులా మారనుంది.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed