గూగు‌ల్‌కు ఊహించని దెబ్బ.. రూ. 21 వేల కోట్లు కట్టాల్సిందేనా..!

by  |
Google
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. గూగుల్‌తో స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోంది అంటూ 2017లో యూరోపియన్ యాంటీట్రస్ట్ ఏకంగా 2.42 బిలియన్ యూరోల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసు వ్యవహారంలో బుధవారం విచారణ చేపట్టిన యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జనరల్ కోర్టు తిరస్కరించింది. ఈయూ కాంపిటీషన్ కమిషన్ ఫైన్‌ను సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా ధరలను కంపేర్ చేస్తోందని.. ఓన్ షాపింగ్ సిఫార్సులను బలవంతంగా ఇంటర్నెట్ వినియోగదారులపై భారం వేయడంతో.. యూరప్‌లోని స్థానిక వ్యాపారులు నష్టపోతున్నట్టు ఈయూ యాంటీట్రస్ట్ తరఫున వాదనలు వినిపించారు. ఇరు వాదనలు పూర్తిగా విన్న యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ జనరల్‌ కోర్టు గూగుల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో యూరప్‌ అత్యన్నత న్యాయస్థానం ఈయూ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది. లేనిపక్షంలో 2.42 బిలియన్ యూరోలు(దాదాపు 21 వేల కోట్లు) చెల్లించాల్సిందే.!


Next Story

Most Viewed